కేంద్ర నిధులను సమర్థంగా వాడుకుంటం : మంత్రి శ్రీధర్ బాబు

కేంద్ర నిధులను సమర్థంగా వాడుకుంటం : మంత్రి శ్రీధర్ బాబు
  • గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది బడ్జెట్‌‌ను అమాంతం రూ.75 వేల కోట్లు పెంచేసిందని, దీంతో బడ్జెట్ అంచనాలు తప్పాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం అసెంబ్లీ లాబీలోని తన చాంబర్‌‌‌‌లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. తమ ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా వాడుకోలేదని ఆరోపించారు.

పీఎం ఆవాస్ యోజనకు ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వస్తాయని, కానీ వాటిని గత ప్రభుత్వం ఉపయోగించుకోలేదని తెలిపారు. గత సర్కార్‌‌‌‌లా కాకుండా తమ ప్రభుత్వం కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించుకుంటుందని తెలిపారు. దావోస్ పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పం దాలు జరిగాయని, అన్ని పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఎంఎస్ఎంఈ అనేది గేమ్ చేంజర్ అని.. దానితో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌దే భవిష్యత్తు అని.. తమ ప్రభుత్వం వచ్చే జూన్‌‌లో ఏఐ గ్లోబల్ సమిట్ నిర్వహిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌‌లో ప్రత్యేకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.