
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సర్దుబాటు పూర్తయిన తరువాత ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు ఇస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉద్యోగాల విభజన ప్రక్రియ స్టార్ట్ అయిందని, జోనల్ విధానం ద్వారా ఉద్యోగులకు మంచి అవకాశం వచ్చిందన్నారు. ఉద్యోగాల సర్దుబాటు పూర్తి కాగానే, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో స్పష్టత వస్తుందని చెప్పారు. మంగళవారం నాంపల్లిలో జరిగిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవో) మీటింగ్‌కు మంత్రి హాజరయ్యారు. ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చే ప్రాసెస్‌కు టీజీవో నేతలు, సీనియర్లు గైడ్ చేయాలన్నారు. జోనల్ విధానం సాఫీగా జరిగేందుకు సహకరించాలని ఉద్యోగులను కోరారు. ఎలాంటి చిక్కులు లేకుండా, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా కొత్త జోనల్ విధానం ప్రవేశపెట్టారని టీజీవో అధ్యక్షురాలు మమత అన్నారు.