
- కొత్త జీపీలకు రోడ్ కనెక్టిటివిటీ పెంచండి
- నాబార్డ్ ఫండ్స్ పీఆర్‌కు ఖర్చు చేయండి
- రోడ్డు పనుల్లో క్వాలిటీ లేకుంటే చర్యలు తప్పవు
- పంచాయతీరాజ్ ఆఫీసర్లతో మంత్రి రివ్యూ
హైదరాబాద్, వెలుగు : తండాలు, కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు రోడ్ కనెక్టివిటీని పెంచాలని పంచా యతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్ వై), ఉపాధి హామీ వంటి పథకాల కింద కేంద్ర ప్రభుత్వ నిధులను పొంది, సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వం నాబార్డ్ నిధుల ను ఇతర పథకాలకు మళ్లించినందున 2014 నుంచి పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ పనులకు నిధులు పొందలేకపోయారని మంత్రి తెలిపారు.
ఇకపై నాబా ర్డు నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గురు వారం సెక్రటేరియెట్‌లో పీఆర్ ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న, రిపేర్ వర్క్స్ ను సకాలంలో పూర్తి చేయాలన్నారు. రోడ్లను క్వాలిటీ లేకుండా నిర్మిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పెం డింగ్ బిల్లుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, బిల్లులు త్వరగా విడుదలయ్యేలా చూస్తానన్నారు. రివ్యూలో పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఈఎన్సీ సంజీవరావు, సీఈలు సీతారాములు, కనకరత్నం, అశోక్ పాల్గొన్నారు.
అంధుల సమస్యలు పరిష్కరిస్తాం..
అంధులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ పరిష్క రిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. బస్ స్టాప్‌లలో అంధులు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా సౌండ్ సిస్టం ఏర్పాటుపై రవాణాశాఖ మంత్రి తో మాట్లాడతానని తెలిపారు. గురువారం మలక్ పేట్ వికలాంగుల భవన్లో లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన ల్యాప్ ట్యాప్ లు, ఫోన్లను అంధులకు మంత్రి అందజేశారు.c