కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో దాడికి గురై సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను మంత్రి సీతక్క పరామర్శించారు. ఆదివాసీ మహిళపై అత్యాచారం..ఆమెపై దాడిచేశారన్న విషయం తెలియగానే గాంధీ ఆస్పత్రికి వెళ్లి బాధితురాలని పరామర్శించారు సీతక్క. కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏం జరిగిందనేదానిపై ఆరాదీశారు. అయితే ఓ ఆటో డ్రైవర్ మహిళను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి దాడి చేసి ఒంటిపై ఉన్న పుస్తెల తాడు లాక్కెళ్లినట్లు బాధిత మహిళ తెలిపింది.
ALSO READ | మెదక్ జిల్లాను ప్రగతి పథంలో ముందు వరుసలో ఉంచాలి : మంత్రి దామోదర రాజనర్సింహా
అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. పరీక్షల అనంతరం తెలుస్తుందన్నారు. దాడి చేసిన ఆటో డ్రైవర్ ను గుర్తించి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారని తెలిపారు. మహిళపై దాడి చేసేవారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు మంత్రి సీతక్క. ఇంకా మెరుగైన వైద్యం అవసరం అనుకుంటే బాధితురాలని నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తామన్నారు సీతక్క.