కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, ప్రిన్స్, మహావీరుడు సినిమాలు తెలుగులో సూపర్ సక్సెస్ అయ్యాయి.దీంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.
రీసెంట్గా శివ కార్తికేయన్ హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నసైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ అయలాన్ (Ayalaan).తమిళంలో సంక్రాంతికి థియేటర్లలో రిలీజై రూ.80 కోట్లకి పైగా కలెక్షన్స్తో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. జనవరి 26న తెలుగు థియేటర్లలో రిలీజై ఆడియన్స్ను ఆకట్టుకుంది.
అయితే, ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజై, తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఆలస్యం చేసింది. ఈ క్రమంలో మూవీ స్ట్రీమింగ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఆడియన్స్ వెయిటింగ్కి ఎండ్ కార్డు పడింది. రిలీజైన రెండేళ్లకు ఓటీటీలో అడుగుపెట్టి ఆశ్చర్యపరిచింది.
ALSO READ : ‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ నిర్మాతలకు
లేటెస్ట్గా అయలాన్ ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది. బుధవారం 2026 జనవరి 7 నుంచి ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ వర్షన్ సన్నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రహాంతరవాసి (ఏలియన్) భూమికి వచ్చి హీరోతో స్నేహం చేయడం, వారి మధ్య జరిగే సరదా సంఘటనలు, విలన్ల నుండి భూమిని కాపాడటం చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఏలియన్ పాత్ర, విజువల్స్, ఫ్యామిలీతో కలిసి చూడదగిన కామెడీ, పిల్లలకు బాగా నచ్చుతుంది.
The future meets fate.
— ahavideoin (@ahavideoIN) January 7, 2026
Watch #Ayalaan now on #ahahttps://t.co/lXRx9eT5ze@Siva_Kartikeyan pic.twitter.com/wtcap4gtLH
అయలాన్ కథేంటంటే:
తామిజ్ (శివకార్తికేయన్) ఓ సాధారణ రైతు. ప్రకృతికి ఎలాంటి నష్టం కలగకుండా సేంద్రియ వ్యవసాయాన్ని నమ్మే వ్యక్తి. కానీ నైతిక విలువలు ఉన్నా… లాభాలు మాత్రం లేవు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరిగిపోతాయి. ఈ పరిస్థితుల్లో తామిజ్‌ను అతడి తల్లి (భానుప్రియ) వ్యవసాయం వదిలేసి నగరానికి వెళ్లి ఉద్యోగం చేయమని ఒత్తిడి చేస్తుంది.
ఇదే సమయంలో ఫ్యూయల్‌కు ప్రత్యామ్నాయంగా నోవా గ్యాస్‌ను కనుగొనే ప్రయోగాల్లో సైంటిస్ట్ ఆర్యన్ (శరద్ ఖేల్కర్) బిజీగా ఉంటాడు. ఈ గ్యాస్‌ను వెలికి తీయడానికి అతడు స్పార్క్ అనే అరుదైన గ్రహశకలాన్ని ఉపయోగిస్తుంటాడు. ఆఫ్రికాలో చేసిన ఒక ప్రయోగం భయంకరంగా విఫలమై వందల మంది ప్రాణాలు కోల్పోతారు. అయినా ఆర్యన్ వెనక్కి తగ్గడు. ఈసారి ఎవరికీ తెలియకుండా ఇండియాలోని ఓ మైన్‌లో రహస్యంగా ప్రయోగాన్ని కొనసాగిస్తాడు.
అయితే ఆ స్పార్క్ కోసం వేరే గ్రహం నుంచి టట్టూ అనే ఏలియన్ భూమిపైకి వస్తుంది. పరిస్థితుల ప్రభావంతో ఆ ఏలియన్ తామిజ్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అమాయక రైతు – అంతరిక్షం నుంచి వచ్చిన అతిథి.. ఈ అనూహ్య కలయికతో కథ మలుపు తిరుగుతుంది. మరి ఆ ఏలియన్ తామిజ్‌ను ఎలా కలిసింది? ఆర్యన్ గ్యాంగ్‌తో టట్టూకి ఎదురైన ప్రమాదం ఏంటి? ఆర్యన్ చేసిన రహస్య ప్రయోగం వల్ల చెన్నై నగరంపై ఎలాంటి ముప్పు పొంచి ఉంది?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ‘అయలాన్’ కథ.
