
తెలంగాణలో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీజేపీ, ఎంఐఎం సభ్యులు మంచి సలహాలు ఇచ్చారంటూ.. విపక్షాలు సూచించిన సలహాలను స్వీకరించి మార్పులు చేస్తామన్నారు. మంచి ఆశయంతో స్కిల్ సెంటర్లను రూపొందిస్తామన్నారు. యువతను గొప్ప మానవ వనరులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఎస్సీ, ఎస్టీ యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు... ప్రతి జిల్లాలో కూడా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. వృత్తి పరంగా కూడా కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగుల స్కిల్ ను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నైపుణ్యా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాదాపు 40 వేల ఉద్యోగాలను భర్తీచేశామన్నారు.