
- బ్రాహ్మణ ఫెడరేషన్‌కు మంత్రి శ్రీధర్ బాబు సూచన
- సెక్రటరీ జనరల్ రవికి అభినందనలు
ముషీరాబాద్, వెలుగు: బ్రాహ్మణులను సంఘటితం చేసి అన్ని రంగాల్లోనూ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ గా కొత్తగా ఎన్నికైన ద్రోణంరాజు రవి కుమార్ బుధవారం మంత్రి శ్రీధర్ బాబు ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవి కుమార్ ను అభినందించిన మంత్రి.. ఫెడరేషన్ కార్యకలాపాలను మరింత క్రియాశీలకం చేయాలన్నారు.
బ్రాహ్మణులను సంఘటితం చేసి సాధికారత సాధించాలని, అదే సమయంలో సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేలా చూడాలన్నారు. పదిహేనేండ్ల విరామం తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి జాతీయ సెక్రటరీ జనరల్ పదవి దక్కడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. తులసి శ్రీనివాస్, పలువురు సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.