- ఆయన కామెంట్లపై కేడర్ చూసుకుంటది: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు : సిరిసిల్లలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన భాషపై ఐటీ ఇండస్ర్టీస్ మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారం పోయిందనే ఆవేదనలో ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని అన్నారు. శుక్రవారం తుక్కుగూడలో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ను కొరికిసంపుతా అనే వ్యాఖ్యలు చాలా బాధాకరమని, అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కావన్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు, కేడర్ చూసుకుంటుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండు రోజుల్లో స్పందిస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ.. తాము కూడా కేసీఆర్ మాట్లాడిన తరువాతే స్పందిస్తామన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే చాలా వరకు అమలు చేశామని, ఎంపీ ఎన్నికల తరువాత మిగతావి అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.