మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పితృవియోగం

V6 Velugu Posted on Feb 14, 2021

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అనారోగ్యంతో మృతిచెందారు. నారాయణ గౌడ్ టీచర్‌గా రిటైర్ అయ్యారు. ఆయన ఆరోగ్యం కొన్ని రోజులుగా సరిగా లేకపోవడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే నారాయణ గౌడ్ ఆరోగ్యం ఆదివారం విషమించడంతో కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యశోద ఆస్పత్రికి వెళ్లి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించారు. నారాయణ గౌడ్ మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు.

For More News..

ట్రైన్ టాయిలెట్‌లో బాలికపై అత్యాచారం

వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు

దేశ చరిత్రలో సంజీవయ్యది చెరగని స్థానం

Tagged Hyderabad, Telangana, Somajiguda, minister srinivas goud, Narayana Goud, TRS MLC Kalvakuntla Kavitha, Yashoda Hospital

Latest Videos

Subscribe Now

More News