దేశాన్ని బీజేపీ ప్రమాదంలోకి నెట్టేస్తుంది

 దేశాన్ని బీజేపీ ప్రమాదంలోకి నెట్టేస్తుంది

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని, ఆ పార్టీ నేతల మాటలు నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదని మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ అన్నారు. సోమవారం టీఆర్‌‌‌‌ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌‌‌‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశాన్ని బీజేపీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నదని, ఒకరిద్దరు వ్యాపారవేత్తల కోసం పనిచేస్తోందని ఆరోపించారు.

దేశంలో ఏ ఒక్క వర్గానికీ కేంద్రం న్యాయం చేయడం లేదన్నారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానిగా ఉండి కూడా అత్యధిక ప్రజలున్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదని ఫైరయ్యారు. కేంద్రంలో ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. బీజేపీకి దమ్ముంటే ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్​ చేశారు.