దేశం అబ్బురపడేలా తెలంగాణ టూరిజాన్ని తీర్చిదిద్దుతామన్నారు మంత్రి శ్రీనివాస్ గైౌడ్. సోమశిల దేవాలయం చరిత్ర పుస్తకంను ఆవిష్కరించిన శ్రీనివాస్ గౌడ్.. కృష్ణ నది పరివాహక ప్రాంతం వందల సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కేసీఆర్ సీఎం అయిన తరువాత అభివృద్ధి చేస్తున్నారన్నారు. బౌద్ధవనం ప్రాజెక్టును ఆసియాలో ఎక్కడ లేని విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాలమూరుకే వలసలు వచ్చేలా టూరిజంను అభివృద్ధి చేస్తున్నామన్నారు
గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి తాము చేసి చూపిస్తున్నామన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయన్నారు. కేంద్రం నుండి 50 వేల కోట్లు వచ్చేలా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రయత్నం చేయాలన్నారు. దుబాయ్ లో ఉన్న తెలంగాణ వాళ్ళను రాష్ట్రానికి తీసుకు వచ్చేలా ప్రయత్నం చేయాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్నారు.
