
హైదరాబాద్: హిమాయత్ నగర్ వై జంక్షన్ లో గంగపుత్ర యువజన సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. చెరువులపై ముదిరాజులకు హక్కు ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గంగపుత్రుల హక్కులను హరించే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. మంత్రి తన వ్యాఖ్యలతో సంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రులను అవమానపరిచారని, గంగపుత్ర సమాజానికి తలసాని క్షమాపణ చెప్పాలని , లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.