అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే గ్యాస్ ధరలు పెంచిండ్రు: మంత్రి తలసాని

అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే గ్యాస్ ధరలు పెంచిండ్రు: మంత్రి తలసాని

కేంద్ర బీజేపీ ప్రభ్యత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నా, ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ధరలను అదుపు చేయడంలో విఫలమైన మోడీ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. అంబానీ, అదానీలకు దోచి పెట్టేందుకే గ్యాస్ ధరలు పెంచారని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవ చేశారు.

2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభ్యత్వం పతనం ఖాయమని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్ లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆర్మీ హాస్పిటల్ లో అనుమతించలేదు..అందుకే సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని ఆ ప్రాంతంలో మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ ను మంజూరు చేశారని గుర్తు చేశారు. కంటోన్మెంట్ లో గతంలో 15 రోజులకు ఒకసారి త్రాగునీటి సరఫరా జరిగేది.. కానీ నేడు ప్రతినిత్యం సరఫరా జరుగుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తం చేసేందుకే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందన్నారు.