
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘీభావం తెలిపారు. కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. కవితకు సంఘీభావం తెలిపేందుకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆమె ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు ఇవాళ బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కవిత ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు.
నిన్న ఎమ్మెల్సీ కవిత గారి ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేసిన నేపధ్యంలో భారీ అనుచరగణంతో వారి ఇంటికి చేరుకొని సంఘీభావం తెలపడం జరిగింది. @RaoKavitha pic.twitter.com/ExoyLnUx4E
— Talasani Srinivas Yadav (@YadavTalasani) August 23, 2022
లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటూ నిన్న బీజేవైఎం నేతలు కవిత ఇంటిదగ్గర ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బలవంతంగా కార్యకర్తలను అదుపులోకి తీసుకొని హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కవితను పరామర్శించడానికి టీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. కవితను కలిసిన వారిలో మంత్రితో పాటు పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు.