పతంగి ఎగరేసిన మంత్రి తలసాని

పతంగి ఎగరేసిన మంత్రి తలసాని

సంక్రాంతి పండుగ సంబురాల్లో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని గాలిపటం ఎగురేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఏడాదిలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి అని, ఇది పాడిపంటలతో రైతన్నలు సంతోషంగా ఉండే సమయమని అన్నారు. అందరినీ ఇంటికి పిలిచి సంతోషంగా మూడ్రోజుల పాటు ఆనందంగా జరుపుకునే పండుగని చెప్పారు. ఆడపడుచులు రంగు రంగుల ముగ్గులతో, అబ్బాయిలు పతంగులతో ఎంజాయ్ చేసే  ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.