సింగిల్ విండో సిస్టమ్ ద్వారా షూటింగ్ లకు పర్మిషన్

సింగిల్ విండో సిస్టమ్ ద్వారా  షూటింగ్ లకు పర్మిషన్

సింగిల్ విండో సిస్టమ్ ద్వారా సినిమా షూటింగ్ లకు పర్మిషన్లు ఇస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ ను సినిమా హబ్ గా తయారు చేయడమే లక్ష్యమన్నారు. సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలపై హైదరాబాద్ BRK భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు తలసాని. ఎగ్జిబిటర్స్ 5వ ఆట ప్రదర్శనకు అనుమతుల మంజూరు, లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన  వివిధ రకాల పన్నుల రద్దుతో పాటు, ఇతర అంశాలపై చర్చించారు. మరోవైపు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు. మీటింగ్ కు సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు అటెండయ్యారు. ఇవాళ్టి సమావేశంలో చర్చ జరిగిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు మంత్రి తలసాని.