ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ సేవలకు మంత్రి ప్రారంభం

 ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ సేవలకు మంత్రి ప్రారంభం

హైదరాబాద్: పేదవారికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తోన్న లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ట్రక్స్ ను  మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదవారికి ఉచితంగా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ పేరుతో లయన్స్ క్లబ్ ముందుకొచ్చిందన్న ఆయన... ఇందుకు రెండు కోట్ల విలువగల 20 ఫుడ్ ట్రక్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. కరోనా సమయంలో తిండిలేక ఎంతో మంది పేదవాళ్లు చాలా ఇబ్బంది పడ్డారని, అలాంటి వాళ్లకు లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు సాయం అందించాయన్నారు. లయన్స్ క్లబ్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.

ఇక దేశంలో రోజుకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ఇప్పటికే నాలాల పునరుద్ధరించామన్న మత్రి... వరద ముంపు జరగకుంగా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. విద్య, వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ప్రభుత్వ బడుల్లో మెరుగైన సదుపాయాల కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.  ఇక అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టామని, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రల బాగు కోసం స్వచ్చంధ సంస్థలు, దాతలు సహకరించాలని మత్రి కోరారు. 

మరిన్ని వార్తల కోసం...

మెట్ గాల 2022 ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న ప్రముఖులు

అధికారం ప్రజల చేతుల్లోకి వెళ్తే మంచి జరుగుతది