మెట్ గాల 2022 ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న ప్రముఖులు

మెట్ గాల 2022 ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న ప్రముఖులు
  • సవ్యసాచి సారీలో మెరిసిన నటాషా పూనావాల
  • వేదిక మీదే ఎంగేజ్ మెంట్ చేసుకున్న న్యూయార్క్ సిటీ కమీషనర్

న్యూయార్క్: మెట్ గాల 2022 ఫ్యాషన్ షోలో ప్రముఖులు సందడి చేశారు. రెడ్ కార్పెట్ పై ర్యాంప్ వాక్ చేసి అలరించారు. రెండేళ్ల కరోనా విరామం తర్వాత అమెరికాలోని న్యూయార్క్ లో మెట్ గాల 2022 ఫ్యాషన్ షో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫ్యాషన్ నైట్ లో ఇటీవలే ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన తల్లి మాయె మస్క్ తో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు. ఇక ఇండియా నుంచి నటాషా పూనావాల సవ్యసాచి సారీలో తళుక్కుమంది.

అలాగే అమెరికన్ సూపర్ మోడల్ బెల్లా హాడిడ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. హాలీవుడ్ స్టార్ ట్విన్స్ లెటో, మిచెల్ ఒకే రకమైన ఫ్యాషన్ దుస్తుల్లో కనిపించి అందరిని కన్ఫ్యూజ్ చేశారు.

ఇక మిస్టరీ మ్యాన్ గెటప్ లో ఫ్రెడెరిక్ రాబర్ట్సన్ అందరినీ నవ్వించాడు. న్యూయార్క్ సిటీ కమీషనర్ లారీ కుంబో ఆమె ప్రియుడు బాబీ డిగీ ఈ వేదిక మీదే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.

కిమ్ కర్దాషియన్ ఆమె ప్రియుడు పీట్ డేవిడ్సన్ తో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. హాలీవుడ్ స్టార్ కపుల్ బ్లేక్ లివ్లీ, ర్యాక్ రెనాల్డ్స్ తమ రాకతో షోకు మరింత అందాన్ని జోడించారు.