నిత్య జీవితంలో క్రీడలు భాగం కావాలి: - మంత్రి తలసాని

నిత్య జీవితంలో క్రీడలు భాగం కావాలి: - మంత్రి తలసాని

ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రపంచంలో ఎన్ని రకాల క్రీడలు ఉన్నా.. క్రికెట్కు  ఉన్న క్రేజే వేరని చెప్పారు.  కరోనాతో ఒక ఏడాది పాటు క్రీడలకు దూరమైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఎక్కువ టీంలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.  హైదరాబాద్ అమీర్ పేట్లోని గురు గోవింద్ సింగ్ మైదానంలో తలసాని యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను మంత్రి తలసాని ప్రారంభించారు.

తలసాని యువసేన ఆధ్వర్యంలో  మూడు రోజులపాటు ఈ పోటీలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ  పోటీల్లో 80 టీమ్స్ పాల్గొంటున్నాయన్నారు. ఆదివారం ఫైనల్ మ్యాచులు జరుగుతాయని ..విజేతలకు రూ.  25వేల నగదు బహుమతి,  రన్నరప్కు రూ.  15 వేల నగదు బహుమతి అందజేస్తామన్నారు.  పోటీల్లో పాల్గొన్న జట్లు  గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు.