జోరువానలో బీజేపీ డ్రామా! : మంత్రి తలసాని శ్రీనివాస్

జోరువానలో బీజేపీ డ్రామా! : మంత్రి తలసాని శ్రీనివాస్
  • జోరువానలో బీజేపీ డ్రామా!
  • కిషన్ రెడ్డి రేపు బాధ్యతలు తీసుకుంటరు
  • అందుకే ఇయ్యాళ్ల డ్రామా స్టార్ట్ చేసిండ్రు
  • బాట సింగారంలో కట్టిన ఇండ్లు లేవా.. ఏం చూస్తరు
  • పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: ‘ఓ దిక్కు జోరు వాన పడ్తుంటె బీజేపీ డ్రామా షురూ చేసింది. కార్యకర్తలను అరెస్టు చేసిండ్రని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోడ్డుపై కూసోని డ్రామా చేస్తుండు. రేపు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటడు.. అందుకే ఆయన ఇవాళనే ఇది స్టార్ట్ చేసిండు..’ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ లో లక్ష ఇండ్లు కట్టాలనేది ప్లాన్ అని, కట్టిన ఇండ్లను వచ్చే నెలలో పంపిణీ చేయాలని డిసైడ్ చేశామని తలసాని చెప్పారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒక్క సీఎం కేసీఆర్ తప్ప మరెవరూ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. కిషన్ రెడ్డి డ్రామా ఎందుకో అర్ధం కావడం లేదని చెప్పారు. అవరసమైతే తామే తీసుకెళ్లి చూపిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు పోటీ పడి ఆందోళనలు చేస్తున్నాయన్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడం, రోడ్లపై కూర్చోవడం.. ఇవన్నీ అవసరం లేదన్నారు. బాట సింగారంలో కట్టిన ఇండ్లు లేవా..? ఆయన వెళ్లి ఏం చూస్తారని ప్రశ్నించారు. ఈ పద్ధతి బాగా లేదని రైట్ రాయల్ గా తమను కూడా వెంట తీసుకెళ్లొచ్చని అన్నారు.