మన్మోహన్ ఎర్త్ సైన్స్ వర్శిటీ దేశానికే తలమానికం: మంత్రి తుమ్మల

మన్మోహన్  ఎర్త్ సైన్స్ వర్శిటీ  దేశానికే తలమానికం: మంత్రి తుమ్మల

డాక్టర్ మన్మోహన్  ఎర్త్ సైన్స్ వర్శిటీ దేశానికే తలమానికం అని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. భద్రాద్రి కొత్తగూడెం సభలో మాట్లాడిన తుమ్మల.. ఎర్త్ వర్శిటీ జిల్లా ప్రజల చిరకాల కాంక్ష అని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇది ఎంతో ఉపయోగం  గొప్ప వర్శిటీనీ ఈ ప్రాంతానికి ఇచ్చినందుకు రేవంత్ కు  ధన్యవాదాలు తెలిపారు తుమ్మల. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. చెప్పిన ప్రతీ మాటను నెరవేర్చామన్నారు. సీతారామ ప్రాజెక్ట్, ఎర్త్ వర్శిటీ ఇలా ఎన్నో ప్రాజెక్టులు  ఖమ్మం జిల్లాకు  వచ్చాయన్నారు.  రేవంత్ రెడ్డి ఎన్నేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటే అన్ని సంవత్సరాలు ఖమ్మం జిల్లా ప్రజలు అండగా ఉంటారని చెప్పారు తుమ్మల.

మంచోడినే సర్పంచ్ గా ఎన్నుకోవాలి

ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతీ అవకాశాన్ని జిల్లాకు ఇస్తున్నామన్నారు రేవంత్.   పదేండ్లు పాలించినోళ్లు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.  ఖమ్మం జిల్లాను అభివృద్ది పథంలో నడిపించే బాధ్యత తనదన్నారు. ముఖ్యమైన శాఖలన్నీ జిల్లాకు చెందిన నాయకుల దగ్గరే ఉన్నయని.. భట్టి,తుమ్మల,పొంగులేటి తలుచుకుంటే  జిల్లాకు రానిదంటూ ఏదీ లేదన్నారు.   సర్కార్ ఏ సంక్షేమ పథకం మొదలు పెట్టినా..ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించామని.. సన్నబియ్యం,రేషన్ పంపిణీ ఈ జిల్లా నుంచే ప్రారంభించామన్నారు. మీ ఓటే ఆయుధంగా మారి ప్రజాపాలన అందిస్తుందన్నారు  రేవంత్.  మంచోడినే సర్పంచ్ గా ఎన్నుకోవాలని.. మందుకో..డబ్బుకో ఓటేస్తే  ఊరు మునుగుతుందని సూచించారు రేవంత్.