సీతారామ ప్రాజెక్ట్.. జిల్లా ప్రజల ఆశా ఆకాంక్ష : మంత్రి తుమ్మల

 సీతారామ ప్రాజెక్ట్.. జిల్లా ప్రజల ఆశా ఆకాంక్ష  : మంత్రి తుమ్మల

సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయటం తన కోరిక అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలో సీతారామ ప్రాజెక్ట్ పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంతగా ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు నీరందించేందుకు తలపెట్టినదని అన్నారు. ఇప్పటికే 7 వేలకోట్ల కు పైగా ఖర్చు చేశామని చెప్పారు. 

టెక్నాలజీని ఉపయోగించి పనులు పూర్తి చేస్తున్నామని మంత్రి చెప్పారు. యాతలకుంట టన్నెల్ పూర్తి అయితే బెత్తుపల్లి,లంకా సాగర్ కు నీళ్లు అందుతాయని తెలిపారు. యాతాల కుంట టన్నెల్ ప్రధానమైందని  నిత్య పర్యవేక్షణతో అధికారులు పనులు పూర్తి చేయాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 

ఈ ప్రాజెక్టుతో ఉభయ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని  తుమ్మల  చెప్పారు.  ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పనులకు ఆటంకం కలగకుండా చూస్తానని చెప్పారు. సీతారామ ప్రాజెక్ట్ జిల్లా ప్రజల ఆశా ఆకాంక్ష అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.