హైదరాబాద్, వెలుగు: తాను మాగంటి సునీత ను గెలిపించాలని కమ్మ సంఘాల ప్రతినిధులకు చెప్పినట్లుగా వస్తున్న వార్తలు పూర్తి అబద్ధమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఇలాంటి ఫేక్‌న్యూస్ బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ప్రజామోదంతో గెలిచేందుకు ప్రయత్నించాలిగానీ ఇలాంటి ఫేక్ న్యూస్ ను నమ్ముకున్న బీఆర్ఎస్ను జూబ్లీ హిల్స్ ఓటర్లు తరిమికొట్టడం ఖాయమన్నారు.
‘‘తప్పుడు ప్రచారం నమ్మొద్దు. ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలి’’ అని కమ్మ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తప్పుడు వార్త ప్రచురించి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిశుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి తుమ్మల కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు.
