కృష్ణా జలాల్లో 71 శాతం వాటా కావాల్సిందే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కృష్ణా జలాల్లో 71 శాతం వాటా కావాల్సిందే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 71శాతం వాటా కోసం గట్టిగ పట్టుబడతామన్నారు ఉత్తమ్. కృష్ణా జలాలను తాగు,సాగుతో పాటు పరిశ్రమలకు వాడుకుంటామని చెప్పారు..సెప్టెంబర్ 23న ఢిల్లీలో జరిగే కృష్ణా ట్రిబ్యునల్ 2 సమావేశం జరగనుంది. ఈ క్రమంలో జలసౌధలో న్యాయనిపుణుల ,నీటి పారుదల నిపుణులతో  ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలను బలంగా  వినిపిస్తామన్నారు.  

 తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ అడ్డుకుంటోందని విమర్శించారు ఉత్తమ్.  బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే ఏపీ జలదోపిడికి పాల్పడుతోందన్నారు.  ఏపీ అక్రమంగా వాడుకున్న 291టీఎంసీలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.  తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కృష్ణా ట్రిబ్యునల్ గుర్తించిందని చెప్పారు ఉత్తమ్. 

అనంతరం సీఎం రేవంత్ తో భేటీ అయిన ఉత్తమ్..  సెప్టెంబర్ 23న  కృష్ణా ట్రిబ్యునల్ ముందు వినిపించాల్సిన వాదనలపై చర్చించారు.  కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంపై చర్చించారు.  న్యాయ యనిపుణులు,నీటిపారుదల నిపుణులతో చర్చల వివరాలను  సీఎంకు వివరించారు ఉత్తమ్.