
హుజుర్ నగర్ ను రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిద్దిద్దుతానన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజుర్ నగర్ పట్టణములో కోటి రూపాయలతో మినీ స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. హుజుర్ నగర్ డిగ్రీ కాలేజ్ అప్రింటిస్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
కేసీఆర్ గత పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు ఉత్తమ్ . రాష్ట్రవ్యాప్తంగా టాటా కంపెనీ ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాము. మా ప్రభుత్వంలో 6 నెలల్లో 30 వేల ఉద్యగాలు భర్తీ చేశాం. గత ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ లు అందుబాటులో ఉన్నాయి. ఐటీఐ పూర్తి అయిన విద్యార్థులకు ప్రతి వారం అప్రెంటిస్ ప్రకారం ఉద్యోగాలు కలిపిస్తాము. కోర్స్ తో పాటు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాము. హుజుర్ నగర్ ఐటీఐ కాలేజీలో 10 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగాల కల్పనకు ఐటీఐ కాలేజ్ ఉపయోగ పడుతుంది. గత ప్రభుత్వం లో ఇండ్లు నిర్మిస్తామని మాయమాటలు చెప్పారు. మా ప్రభుత్వం వచ్చిన తరువాత 78 కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నాము. పారదర్శకంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని ఉత్తమ్ చెప్పారు.