
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆల్మట్టి డ్యాం ఎత్తుపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని.. రేపు(సెప్టెంబర్ 22) ఢిల్లీ వెళ్లి వాదనలు వినిపిస్తామని చెప్పారు. కృష్ణా, గోదావరి నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం ఏ రాష్ట్రంతో నైనా పోరాడుతామని . సెప్టెంబర్ 21న సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు ఉత్తమ్.
ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు కృష్ణా, గోదావరి నది జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 811 టీఎంసిల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు అంటూ కేసీఆర్ లిఖితపూర్వకంగా రాసిచ్చారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలోనే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.. వాళ్ల హయాంలోనే కూలిపోయిందన్నారు ఉత్తమ్. కాలేశ్వరం ప్రాజెక్టు పై ఎంక్వైరీ జరుగుతుందని.. ఎంతటి వారినైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు ఉత్తమ్. తుమ్మిడి హట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్.