చరిత్రలో నిలిచిపోయేలా ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

చరిత్రలో నిలిచిపోయేలా ఇరిగేషన్  ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నీటిపారుదల రంగంలో ఈ టర్మ్ లో  చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతమైన పనులు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం అడివి అజిలాపూర్ గ్రామంలో32.5 కోట్లతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు ఉత్తమ్, వాకిటి శ్రీహరి.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..  వచ్చే జూన్ 4, 5 తేదీలలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నేను ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను స్వయంగా పర్యవేక్షిస్తాం. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి మా ప్రభుత్వం వెనుకాడదు. అంతేకాకుండా గత ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పాలకులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ.. పాలమూరు ప్రాజెక్టులపై లేదని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయిందని బిఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ALSO READ : కర్నాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసిన వెంటనే.. పెండింగ్ బిల్లులన్నింటినీ క్లియర్ చేసి, పనులను వేగవంతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ టర్మ్ లోనే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్,  పాలమూరు ఎత్తిపోతల పథకం పనులన్నింటినీ పూర్తి చేసి, పాలమూరు గడ్డను సస్యశ్యామలం చేయడానికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.