అక్టోబర్ 25న హుజూర్నగర్లో మెగా జాబ్మేళా..వాల్ పేపర్ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్

అక్టోబర్ 25న హుజూర్నగర్లో మెగా జాబ్మేళా..వాల్ పేపర్ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: హుజూర్​నగర్​లో ఈ నెల 25న మెగా జాబ్​మేళాను నిర్వహించనున్నట్టు ఇరిగేషన్, సివిల్​సప్లైస్​శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి తెలిపారు. ఈ మెగా జాబ్​మేళాలో 150 కంపెనీలు భాగమవుతాయని, 10 వేల మందికిపైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జాబ్​మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఆయన సెక్రటేరియెట్​లో డిజిటల్​ఎంప్లాయ్​మెంట్​ఎక్స్చేంజ్​అధికారులతో కలిసి ఆయన మెగా జాబ్​మేళా వాల్​పేపర్​ను ఆవిష్కరించారు.

దీనిని  ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని ఉత్తమ్​చెప్పారు. ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్, ఫార్మా, బ్యాంకింగ్ సహా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. నిరుద్యోగుల కోసం జాబ్​మేళా జరిగే చోట హెల్ప్​డెస్క్​తో పాటు ఆన్​లైన్​లోను సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైన చోట కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మిషన్ లు ఏర్పాటు చేయలని డీట్ అధికారులకు ఆయన సూచించారు.