మక్తల్ పట్టణంలో స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి వాకిటి

మక్తల్ పట్టణంలో స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి వాకిటి

మక్తల్/మదనాపురం, వెలుగు: మక్తల్ పట్టణంలో రూ. 25 కోట్లతో నిర్మించనున్న స్టేడియంలో అన్ని వసతులు కల్పించాలని పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించారు. ఇండోర్, అవుట్ డోర్ మైదానాల రూపకల్పనపై పలు మార్పులను సూచించారు. 

స్థానికంగా వందల మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారికి మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌‌లను కూడా నియమిస్తామని, పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి పండుగలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం కమిటీ సభ్యులు మంత్రిని సన్మానించారు.