వైఎస్ నీళ్ల దొంగగా మారితే.. జగన్ గజ దొంగగా మారాడు

వైఎస్ నీళ్ల దొంగగా మారితే.. జగన్ గజ దొంగగా మారాడు

తెలంగాణ రావలసిన నీటిని.. ఏపీ అక్రమంగా దోచుకెళ్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ నీటి హక్కును కాలరాస్తూ… పోతిరెడ్డి పాడు నుంచి క్రిష్ణా నీటిని అక్రమ తరలింపుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీళ్ల దొంగగా మారితే.. తండ్రి దారిలోనే పయనిస్తూ జగన్ గజ దొంగగా మారాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్, రాయలసీమ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం పోరాటానికి సిద్దమవుతున్నదని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. అప్పటికి కూడా ఏపీ దిగిరాకపోతే.. ప్రజా యుద్దానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు అన్యాయం చేస్తే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. లంకల పుట్టినోళ్లందరూ రాక్షసులేనని.. ఆంధ్రోళ్లు ఎప్పుడూ తెలంగాణ మంచి కోరుకోలేదని ఆయన అన్నారు.