చెన్నూరులో నిరుద్యోగ యువతకు భరోసా.. కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్ ప్రారంభం

చెన్నూరులో నిరుద్యోగ యువతకు భరోసా..  కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్ ప్రారంభం

చెన్నూరు పట్టణంలో యువత ఉజ్వల భవిష్యత్ లక్ష్యంగా కీలక అడుగు పడింది. కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్ను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ  వంశీకృష్ణ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. చదువు ద్వారానే మంచి భవిష్యత్ సాధ్యమని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో యువతీయువకులు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి, రాష్ట్రంలోనే చెన్నూరును ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ఫౌండేషన్ కల్పిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

►ALSO READ | పిల్లలు కింద కూర్చోవడం బాధగా ఉంది: ఎంపీ వంశీ కృష్ణ భావోద్వేగం

అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ సాధన తర్వాత నిరుద్యోగ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదన్నారు. విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 'టామ్‌కామ్' (TOMCOM) ద్వారా ప్రత్యేక చొరవ చూపుతోందని, నిరుద్యోగ యువత ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వేదికలను ఉపయోగించుకుని తమ కాళ్లపై తాము నిలబడాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కోరారు.