బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ నాయకత్వం అవసరమా..?

 బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ నాయకత్వం అవసరమా..?

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో కేటీఆర్ లీడర్ షిప్ పార్టీకి అవసరం ఉందా..? అని బీఆర్ఎస్ ఆలోచించుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. కుటుంబలో ఆస్తుల పంచాయితీ నడుస్తున్నదని.. అన్నా, చెల్లి మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. “వీక్ లీడర్ షిప్‎తో కేటీఆర్. ఆయన బావ హరీశ్ మధ్య గొడవలు వచ్చే చాన్స్ ఉంది. ఇద్దరిలో ఎవరు బెటర్ అనేది నిర్ణయించుకోవాలి. కేటీఆర్ పార్టీని నడిపించడంలో ఫెయిల్ అవుతు న్నారు.

ఆయన వల్ల పార్టీకి లాభమా.. నష్టమా.. అనేది హరీశ్ ఆలోచించుకోవాలి. కేటీఆర్ కింద పనిచేయాలా? అని హరీశ్ ఆలోచించుకునే టైమ్ వచ్చింది. సోషల్ మీడియాలో హైప్తో గెలుస్తామనుకున్నరు. కానీ అది కూడా ఫెయిల్ అయ్యింది. ప్రజలు సోషల్ మీడియాను ఫాలో అవుతారు. కానీ కేటీఆర్ లీడర్ షిప్‎లో కంటెంట్ లేకుంటే ఎంత ఫాలో చేసినా.. లాభం లేదు" అని వివేక్ అన్నారు.