కనీస వేతనాల పెంపుతో కోటి 11లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.సచివాలయంలో సీఎంతో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది జూన్ 1 నుంచి పెంచిన కనీస వేతనాలు అమల్లోకి రానున్నాయని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విస్మరణకు గురైందని విమర్శించారు. కార్మికుల కష్టానికి గుర్తింపునిస్తూ, తాము అధికారంలోకి రాగానే కనీస వేతనాలపై ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సబ్ కమిటీ సిఫార్సుల మేరకు..కనీస వేతనాలు పెంచాలని నిర్ణయించామన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి 11 లక్షల మంది కార్మికులకు భారీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు వివేక్.
కార్మికులకు గుడ్ న్యూస్
కార్మికులను కార్పొరేషన్ల పరధిలో గ్రేడ్ 1, మున్సిపల్ పరిధిలో గ్రేడ్ 2, గ్రామీణ ప్రాంతాల్లో గ్రేడ్ 3గా అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ గా విభజించి కనీస వేతనాలు పెంచారు. జోన్ 1లో కనీస వేతనం రూ.12వేల 750 నుంచి రూ.16వేలకు పెంచారు. స్కిల్డ్ కార్మికులకు రూ.13వేల 772 నుంచి రూ. 18వేల 500లకు, జోన్ 1లో సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13వేల 592నుంచి రూ.17వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
