సింగరేణి కార్మికులకు కోటి బీమా .. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నం: మంత్రి వివేక్

సింగరేణి కార్మికులకు కోటి బీమా .. బీఆర్ఎస్ తప్పుడు  ప్రచారాన్ని ఖండిస్తున్నం: మంత్రి వివేక్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులకు కోటి రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా అమలవుతోందని.. దీనిపై బీఆర్ఎస్​ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం తరఫున ఖండిస్తున్నామని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. 

గురువారం అసెంబ్లీ లాబీలోని తన చాంబర్ లో మీడియాతో మంత్రి చిట్ చాట్ చేశారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా నిత్యం తప్పుడు ప్రచారం చేస్తోందని, దీనిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా మరింత బలోపేతం కావాల్సి అవసరం ఉందన్నారు. స్కాముల పేరుతో తమ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ సోషల్ మీడియా చేస్తున్న  ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని మంత్రి వివేక్​అభిప్రాయపడ్డారు.