- నవీన్ యాదవ్‌కు ప్రజల నుంచి అపూర్వ మద్దతు
- షేక్ పేట్ లో మంత్రి వివేక్‌తో కలిసి నీలం మధు ప్రచారం
బంజారాహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఆదివారం షేక్ పేట్ పరిధిలో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నీలం మధు ముదిరాజ్ప్రచారం నిర్వహించారు. నీలం మధు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అన్నివర్గాల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోందన్నారు.
కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గంలో 14 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, 8 వేల మంది లబ్ధి దారులను కొత్తగా చేర్చడం జరిగిందన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు అగ్రవర్ణాలకు టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ మాత్రం నిత్యం బస్తీ ప్రజలకు అందుబాటులో ఉండే బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించిదన్నారు. నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు నవీన్ యాదవ్ కు బ్రహ్మరథం పడుతున్నారని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం
ఖాయమైందన్నారు.
