యూరియా నిల్వలు లేవని రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి

యూరియా నిల్వలు లేవని రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా మందమర్రిలోని నూతన కార్మెల్ డిగ్రీ కాలేజీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యూరియా నిల్వలు లేవని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశానని అన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోందని అన్నారు. 

తెలంగాణలో కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని.. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ నిలబెట్టుకోలేదని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు. అంబేద్కర్ విద్యా సంస్థల ద్వారా సుమారు 5వేల మంది విద్యార్థులు విద్య పూర్తి చేస్తున్నారని.. ఇటీవలే ఇండియా టుడే సర్వేలో వ్యాల్యూ ఫర్ మనీలో అంబేద్కర్ విద్యా సంస్థలకు 4వ ర్యాంకు సాధించిన ఘనత ఉందని అన్నారు.

►ALSO READ | హైదరాబాద్ సిటీలో ఈ ఏరియా వాళ్లకు ఈ రాత్రి దబిడి దిబిడే: కుండపోత వర్షం అంటూ GHMC అలర్ట్

అంబేద్కర్ విద్యా సంస్థల్లో కేజీ టూ పీజీ విద్యను అందిస్తున్నామని.. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ అంబేద్కర్ విద్యాసంస్థ అని అన్నారు. ఇటీవల వచ్చిన ఫలితాల్లో స్టేట్ లో 2వ ర్యాంకు సాధించిన ఘనత అంబేద్కర్ విద్యా సంస్థలకు దక్కిందని అన్నారు. 63 ఏళ్ళ నుంచి కార్మినల్ స్కూల్ విద్యా సంస్థలు మంచి విద్యను అందిస్తున్నాయని అన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు సర్కార్ 10 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిందని అన్నారు.ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచామని... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.