మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నం.. అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తున్నం: మంత్రి వివేక్

మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నం.. అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తున్నం: మంత్రి వివేక్
  • జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 నెలలుగా రూ.150 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించినట్టు వెల్లడి
  • షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముస్లింలతో సమావేశం
  • హాజరైన మంత్రి అజారుద్దీన్, పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్

జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి తెలిపారు. ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలను సమాన దృష్టితో చూస్తూ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం జూబ్లీహిల్స్​ నియోజకవర్గం షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అజీజ్ బాగ్ కాలనీలో ముస్లింలు నిర్వహించిన సమావేశానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ ‌‌‌గౌడ్  హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ..ఈ ప్రాంతంలో స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తాగునీరు, సీసీ రోడ్లులాంటి సమస్యలను ఎన్నికల అనంతరం తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైందని చెప్పారు. ఇక్కడ గత రెండు నెలలుగా సుమారు రూ. 150 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలని  స్థానికులను కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అండగా నిలుస్తుందని మంత్రి అజారుద్దీన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముస్లింలందూ పనిచేయాలని కోరారు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖబరస్తాన్​ కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. కాంగ్రెస్​అభ్యర్థి నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.