రాష్ట్ర ప్రజలకు మంత్రి వివేక్ వెంకటస్వామి దసరా శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు మంత్రి వివేక్ వెంకటస్వామి దసరా శుభాకాంక్షలు

పెద్దపల్లి జిల్లా: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. NTPCలోని భవాని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. గోదావరిఖని మార్కండేయ కాలనీ హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో కూడా మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు చేశారు. వివేక్ వెంకటస్వామికి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికి శాలువాలతో కమిటీ సభ్యులు సన్మానించారు.

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ దసరా అని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, విజయదశమి అందరి జీవితాల్లో విజయాలను చేకూర్చాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు.