- 20 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తం
- ప్లాట్ ఫాం కంపెనీలపై నిబంధనలు
- 1–2% లెవీతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు
- బీమా, పెన్షన్, మెటర్నిటీ బెనిఫిట్స్ కూ ప్లాన్
- పారదర్శక విధానం.. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ
- అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి వివేక్
హైదరాబాద్ : గిగ్ వర్కర్ల హక్కులు, భద్రత కోసం రాష్ట్ర ప్రభు త్వం కీలక అడుగు వేసింది. తెలంగాణ ప్లాట్ ఫాం ఆధారిత గిగ్ వర్కర్ల నమోదు. సామాజిక భద్రత, సంక్షేమ బిల్లు 2026ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ బిలును ప్రవేశపెట్టారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గిగ్ పర్కర్లకు చట్టబద్ద గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. వర్కర్ల హక్కులు, గౌరవం, జీవనోపా ధిని కాపాడే విధంగా నిబంధనలు రూపొందిం చారు. ఈ బిల్లులో భాగంగా ప్లాట్ఫాం సంస్థలు క్రమం తప్పకుండా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఎలక్ట్రానిక్ రిటర్న్స్ ఇవ్వాలి. నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధించనున్నారు. మొదటి తప్పి దానికి రూ.50 వేలు, రెండోసారి రూ.1 లక్ష, మూడోసారి రూ.1.5 లక్షలు, ఆ తర్వాత బకా యిలపై ఐదు రెట్లు వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి వర్కర్కు యూనిక్ ఐడీ ఇవ్వనున్నారు. 1-2 శాతం లెవీతో వెల్ఫేర్ ఫండ్ సిద్ధం చేసి, ఇన్సూరెన్స్, పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలు కల్పించను న్నారు. ప్రతి లావాదేవీపై ఫీజు వసూలు చేసి, బోర్డు నిర్వహణ ఖర్చులకు గరిష్టంగా 5% విని యోగించనున్నారు. అదేవిధంగా పారదర్శక విధానాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వేతనాలు, కట్టింగుల వివరాలు స్పష్టంగా తెలియజేయ డం, అల్గోరిథమ్ వినియోగంలో విపక్ష లేకుండా చూడడం వంటి అంశాలను బిల్లులో చేర్చారు.
65 సలహాలు వచాయి
గిగ్ వర్కర్స్ కి భద్రత కల్పించాలని ప్రభుత్వం బిల్ తెచ్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి వాళ్ళతో చెప్పారు. సీఎం యూనియన్ వాళ చర్చించి సమస్యలు తెలుసుకున్నారని అననారు. డ్రాఫ్ట్ బిల్ సిద్ధం చేసి 30 రోజులు పబ్లిక్ డొమైన్ లో పెట్టామని తెలిపారు. 65 సలాహాలు వచ్చాయని, వాటిని కమిటీ డ్రాఫ్ట్ లో మెన్షన్ చేసిందని వివరించారు. తాను మంత్రిని అయ్యాక ఐదు సమావేశాలు నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. యూనియన్ల సందేహాలను నివృత్తి చేశామని, 20 మందితో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కమిటీ లో గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్స్ ఉంటారని మంత్రి చెప్పారు. ఏటా సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. బిల్లు అనంతరం కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గిగ్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూనిక్ ఐడీ వస్తుందని చెప్పారు. స్విగ్గీ, జామాటలో ఇలా అన్ని కంపెనీలకు ఒకటే ఐడీ ఉంటుందన్నారు. గిగ్ వర్కర్స్ తమ సమస్యలు కమిటీకి చెప్పుకోవచ్చని అన్నారు.ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక అధికా-రులతో పాటు ప్లాట్ఫార్మ్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గిగ్ పర్కర్లకు భద్రత.. హక్కులు కల్పించే దిశగా ఈ బిల్లు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది.
