
గజ్వేల్, వెలగు: సిద్దిపేట జిల్లా వర్గల్ లోని విద్యా సరస్వతీ క్షేత్రంలో నిర్వహించే దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలకు ఆదివారం రాష్ట్ర మంత్రులను ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావును హైదరాబాద్ లో కలసి అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి ఆహ్వాన పత్రిక అందజేశారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో తామూ పాల్గొంటామని చెప్పారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.