
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో కార్యకర్తల భేటీలో పాల్గొన్న ఆయన.. మైనార్టీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఒక్క సారి హామీ ఇచ్చామంటే తప్పకుండా నెరవేరుస్తామన్నారు. రహమాత్ నగర్ లో రూ. 20 కోట్ల పనులు మంజూరు చేశామన్నారు. తొందలోనే ఆ పనులు మొదలుపెడతామని చెప్పారు.
రహమత్ నగర్ లో ఉన్న శ్మశాన వాటిక సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు మంత్రి వివేక్. ఈ విషయం గురుంచి కలెక్టర్, వక్ఫ్ బోర్డు చైర్మన్ తో మాట్లాడి స్థలం కోసం సర్వే చేయమని ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. తొందరలోనే మీకు మంచి కబారస్థాన్ నిర్మాణం చేస్తామన్నారు. మంచి స్థలం రోడ్డు సమస్య లేకుండా కబారస్థాన్ నిర్మిస్తామన్నారు. మైనార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు.
►ALSO READ | Sandeep Reddy Vanga: సీఎం రేవంత్ రెడ్డికి రూ.10 లక్షల చెక్ అందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా