Sandeep Reddy Vanga: సీఎం రేవంత్ రెడ్డికి రూ.10 లక్షల చెక్ అందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: సీఎం రేవంత్ రెడ్డికి రూ.10 లక్షల చెక్ అందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూ.10 లక్షల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించారు. ఈ సందర్భంగా తన సొంత బ్యానర్ భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా, సందీప్ రెడ్డి వంగా పదిలక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.

ఇవాళ (ఆగస్టు 29న) జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కుని అందించారు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరుపు లేని భారీ వర్షాల కారణంగా ఎంతోమంది నష్టపోయారు. అందువల్ల దర్శకుడు సందీప్ రెడ్డి ఈ సహాయం అందించినట్లు సమాచారం.

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. టాలీవుడ్ లో హిట్ పడగానే బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడ కూడా కబీర్ సింగ్, యానిమాల్ సినిమాలతో హిందీ ప్రేక్షకులను ఫిధా చేశాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌‌‌‌ హీరోగా ‘స్పిరిట్’ అనౌన్స్ చేసి టాక్ అఫ్ ది ఇంటర్నేషనల్ గా మారాడు.

స్పిరిట్ విషయానికి వస్తే.. ఇప్పటికే, ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది. త్వరలో షూటింగ్ షురూ కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. త్వరలోనే షూటింగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.