జూబ్లీహిల్స్ లో త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం: మంత్రి వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్ లో  త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం: మంత్రి వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్ లో త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ లో ఇవాళ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. రహమత్ డివిజన్ లోని SPR హిల్స్  కార్మిక నగర్ లో రూ.4.66 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.

 ఈ సందర్బంగా మాట్లాడిన  వివేక్ వెంకట స్వామి..జూబ్లీహిల్స్ లో త్వరలో  అర్హత ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామన్నారు.  ప్రభుత్వం సన్నబియ్యం,  రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తోందన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం సాంక్షన్ ల పేరుతో పేపర్స్ చూయించి  ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. కృష్ణా నగర్ లో ఉన్న  కలవర్ట్ సమస్య గురించి  సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ లో ఉన్న హై టెన్షన్ వైర్స్ తొలగిస్తామన్నారు వివేక్.  తాము  అంత మీకోసం ఉన్నామని.. ఎం పనులు కావాలో లిస్ట్ రాసుకున్నానని చెప్పారు . ఇక్కడ మంచి జోనల్ కమిషనర్ ఉన్నారు.పనులు అన్ని  టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు మంత్రి వివేక్ .

బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకుందని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  కేసీఆర్   కుటుంబ సభ్యులు ఫామ్ హాస్ లు కట్టుకున్నారని విమర్శించారు.  మీరంతా ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అండగా ఉండాలన్నారు.  జూబ్లీహిల్స్ లో  ఉన్న ఫేక్ ఓట్లను గుర్తించాలన్నారు. తప్పుగా నమోదు చేసుకున్న వారిని తొలగించి.. రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ కార్యక్రమానికి మద్దతుగా నిలవాలన్నారు.