రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చెన్నూరు పట్టణంలోని పాత బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు మంత్రి వివేక్. అంబేద్కర్ ఉత్సవ సమితి ఆధ్వర్యలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. వేడుకల్లో పాల్గొనేందుకు చెన్నూరు పట్టణానికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తుందని అన్నారు. 32 డిగ్రీలను సంపాదించిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకామిక్స్ లో చదివి పాస్ అయిన దేశంలోనే మొట్ట మొదటి వ్యక్తి అన్నారు. దేశ స్వాతంత్ర్య సమయంలో స్వాతంత్ర్యం కావాలని కోట్లాడుతుంటే.. అంబేద్కర్ దళితులకు స్వాతంత్ర్యం కావాలని కోట్లాడారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

