
- గడి మైసమ్మ తల్లికి మంత్రి వివేక్ వెంకటస్వామి పూజలు
కోల్బెల్ట్/ చెన్నూరు, వెలుగు: గడి మైసమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం చెన్నూరు పట్టణ కేంద్రంలోని గడిమైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని శాలువాతో సన్మానించారు. మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.
ఏసీపీ కుటుంబానికి పరామర్శ
పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ కుటుంబాన్ని మంత్రి వివేక్పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఏసీపీ కృష్ణ తండ్రి ఐలయ్య మృతిచెందగా జైపూర్మండలం రసూల్పల్లిలోని ఏసీపీ ఇంటికి మంత్రి వెళ్లారు. ఐలయ్య ఫొటోకు నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు.