- బీఆర్ఎస్ డోకా కార్డును విడుదల చేసిన మంత్రి
- గడ్డం వివేక్ వెంకటస్వామి
సిద్దిపేట రూరల్, వెలుగు: బీఆర్ఎస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బుస్సాపూర్ మాజీ సర్పంచ్ కేదారి సదాశివ రెడ్డి రూపొందించిన బీఆర్ఎస్ డోకా కార్డును హైదరాబాద్ లో మంత్రి వివేక్ ఆవిష్కరించారు.
ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ఇచ్చిన హామీలు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం హోదాలో ఇచ్చిన హామీలు ఏ రకంగా తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసి డోకా ఇచ్చారో వివరిస్తూ డోకా కార్డును రూపొందించినట్లు సదాశివరెడ్డి తెలిపారు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రన్ని అప్పులకుప్పగా మార్చి, వారు మాత్రం ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మంద పాండు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డి, సురేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు.
