చెన్నూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. తాను గెలిచిన నాటి నుంచి ఈ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కృషి చేశానని చెప్పారు. చెన్నూరు మున్సిపాలిటీనీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
సుమారు 20 లక్షలతో ఈ అంబేద్కర్ భవనం నిర్మించా.. మరో 20 లక్షలతో ప్రహరీ గోడ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు వివేక్. అంబేద్కర్ భవనాన్ని దళిత సంఘాల వాళ్లందరూ వాడుకోవాలని సూచించారు. భీమారం మండలంలో నేతకాని భవనానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో అమృత్ 2.0 పనులతో తాగు నీటి ఇబ్బందులు తొలగిపోతున్నాయని చెప్పారు. చెన్నూరులో మరో ఆల్టర్నేట్ మంచి నీటి కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించాను. త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చెన్నూరులో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి త్వరలోనే పూర్తి చేసుకొని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. 100 పడకల ఆసుపత్రికి సిబ్బంది కోసం ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మాట్లాడినట్టు చెప్పారు వివేక్.
