
- గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో వరదలు
- నాలాలు, డ్రైనేజీలను పట్టించుకోలేదని ఫైర్
- బాటిల్ నెక్ ప్రాబ్లమ్స్‌తో ముంపు: మంత్రి పొన్నం
- జూబ్లీహిల్స్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
జూబ్లీహిల్స్, వెలుగు: గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో వరదలు వస్తున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ పేదల బస్తీల్లో అభివృద్ధిని మరిచిందని మండిపడ్డారు. డ్రైనేజీలు, నాలాలను పునర్నిర్మించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వరద బాధితులను ఆదుకుంటామని, ముంపు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి వివేక్ పర్యటించారు. తొలుత షేక్‌పేట డివిజన్ ఓయూ కాలనీలోని ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. అనంతరం యూసుఫ్‌గూడ, కృష్ణానగర్ ఏరియాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. లోకల్ రోడ్లన్నీ గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఉండేలా చూడాలని నిర్ణయించామని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు డబ్బు లు తీసుకుని, ఈ పనులను నిర్లక్ష్యం చేశారని మంత్రి వివేక్ వెంకట స్వామి మండిపడ్డారు. ఓయూ కాలనీలో వాటర్ డ్రైన్ పనులు చేపట్టామని, ఆ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. వాటర్ డ్రైన్ పనులు పూర్తయి తే భవిష్యత్తులో ఇక్కడ ముంపు సమస్యలు ఉండవని ఆయన తెలిపారు. అక్టోబ ర్ 15లోపు అన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్య లు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.
నాలాలను అభివృద్ధి చేస్తున్నం: పొన్నం
24 గంటల్లో కురవాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇండ్లలోని పాత వస్తువులు, చెత్తను రోడ్లపై పడవేయవద్దని ప్రజలకు సూచించారు. ‘‘నాలాలు, బాటిల్ నెక్ ప్రాబ్లమ్స్ వల్లే కృష్ణానగర్‌లో వరదలు వస్తున్నాయి. ఇప్పుడున్న నాలాలను అభివృద్ధి చేసే పనులను చేపట్టాం” అని తెలిపారు. మంత్రుల వెంట జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషన్ ఏవీ రంగనాథ్, కాంగ్రెస్ నేతలు విష్ణునాథ్, నవీన్ యాదవ్ తదితరులు ఉన్నారు.
దివ్యాంగుల కోసం ఏడాదిలోనే 50 కోట్లు ఖర్చు: మంత్రి వివేక్
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.64 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.50 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘‘గతంలో దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందాలంటే మీ సేవ, దవాఖానల చుట్టూ నెలల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం దివ్యాంగుల దగ్గరికే డాక్టర్లు, ఇతర అధికార యంత్రాంగం వచ్చి స్పాట్‌లోనే సర్టిఫికెట్లు ఇస్తున్నారు” అని చెప్పారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘దివ్యాంగులకు పంపిణీ చేసేందుకు స్కూటీలు, వీల్‌చైర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు, ఇతర పరికరాలు కొనుగోలు చేశాం. త్వరలో సీఎం చేతుల మీదుగా దివ్యాంగులకు అందజేస్తాం” అని తెలిపారు. ఈ క్యాంపు ఏర్పాటు చేసిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యను మంత్రులు అభినందించారు.