- రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి
- కోటపల్లి, చెన్నూరు మండలాల్లో మంత్రి విస్తృత ప్రచారం
కోల్‌బెల్ట్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్అభ్యర్థులను గెలిపించుకుంటేనే గ్రామాలాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు నియోకవర్గంలోని కోటపల్లి, చెన్నూరు మండలాల పంచాయతీ అభ్యర్థుల తరఫున ఆదివారం మంత్రి విస్తృత ప్రచారం చేశారు.
మంత్రి వెంట మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, రాష్ట్ర లీడర్ బండి సదానందం యాదవ్‌పాల్గొన్నారు. కాంగ్రెస్బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి ఎక్కువ నిధులు తీసుకొస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పంచాయతీలను అభివృద్ది పథంలో నిలిపేందుకు సమష్టి కృషి చేస్తామన్నారు.
కోటపల్లి మండలం కొడంపేట, మల్లంపేట, కోటపల్లి, సర్వాయిపేట, రాపన్‌పల్లి, అన్నారం, బబ్బెర చెలక, దేవులవాడ, పారుపెల్లి, సిర్సా గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు ఆరె వెంకటమ్మ, తాళ్ల వెంకటమ్మ, అలూరి సంపత్, బన్సీనాయక్, అట్టెల లస్మయ్య, దుర్గం శంకరమ్మ, మూల ప్రదీప్ రెడ్డి, దుర్గం సమ్మక్క, తాండ్ర సరేశ్, గొడిసెల వైజయంతికి మద్దతుగా మంత్రి ప్రచారం చేశారు. పలు పంచాయతీల్లో బోర్ల నిర్మాణానికి హామీ ఇచ్చారు.
ఎస్టీ భవన్‌కు రూ.20 లక్షల ఫండ్స్ మంజూరు చేస్తానన్నారు. అంతకుముందు జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ బలపరుస్తున్న జైపూర్ సర్పంచ్ అభ్యర్థి కూన భాస్కర్‌కు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి మనుబోతుల సమ్మయ్య, ఆయన అనుచరులు కాంగ్రెస్‌లో చేరగా వారికి మంత్రి వివేక్ కండువాలు కప్పి ఆహ్వానించారు. చెన్నూరు మండలం కిష్టంపేట, సుద్దాల, కత్తెరసాల గ్రామ సర్పంచ్ అభ్యర్థులు దుర్గం లక్ష్మి, మాదాసు రమాదేవి, రామగిరి సునీతకు మద్దతుగా ప్రచారం చేశారు. మంత్రి వెంట జైపూర్ ఎన్నికల ఇన్చార్జ్ గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, లీడర్లు, కార్యకర్తలు ఉన్నారు.
