నెల రోజుల్లోనే జూబ్లీహిల్స్ లో పనులు పూర్తి చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

నెల రోజుల్లోనే జూబ్లీహిల్స్ లో పనులు పూర్తి చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఎన్నికలతో సంబంధం లేకుండా నెల రోజుల్లోనే జూబ్లీహిల్స్ లో  అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.జూబ్లీహిల్స్ లోని  షేక్ పేట తేజా కాలనీలో సీసీ రోడ్డు, డ్రైయిన్స్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి . ఇచ్చిన మాట ప్రకారం పనులు ప్రారంభించడంతో మంత్రితో కేక్ కట్ చేయించారు స్థానికులు.  

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. నెల రోజుల ముందు సీసీ రోడ్డులు లేవని స్థానికులు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు సాంక్షన్ చేయించా. ఇక్కడ ప్రజల కోసం రూ. 40 లక్షలతో మొదలు పెట్టాం. ఎన్నికలతో సంబంధం లేకుండా నెలలో పనులు పూర్తి చేస్తాం. గతంలో బీఆర్ఎస్ ఓట్లు వేసుకొని గాలికి వదిలేసింది. 10 ఏళ్ళలో బీఆర్ఎస్  ఎలాంటి పనులు చేయలేదు.  కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఉంది.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రజలు అందరు పనులు చేయిస్తున్నామని సంతోషంగా ఉన్నారు. ఇంకా మూడేళ్లు మేమే అధికారంలో ఉంటాం. ముందు ఉండి అన్ని అభివృద్ధి పనులు చేయిస్తాం అని అన్నారు. 

మరో వైపు జూబ్లీహిల్స్ బైపోల్ కు షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీపడుతుండగా..కాంగ్రెస్,బీజీపీ ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు.

►ALSO READ | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 407 పోలింగ్ స్టేషన్లు.. రూ.6 కోట్ల ఖర్చు: ఆర్వీ కర్ణన్